- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్దోంది. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. భువనగిరి జాయింట్ కలెక్టర్ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
- Advertisement -