మహేశ్ బాబు పాటకి మరోసారి డ్యాన్స్ చేసిన సితార

403
Mahesh babu Daughter
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు కూతురు సితార కు కూడా అతే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ లో సందడి చేస్తుంది సితార. తన మాటలు, డ్యాన్స్ తో ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కొద్ది రోజుల క్రితం ఫ్యామిలితో కలిసి మహేశ్ బాబు ఓ యాడ్ చేశాడు. ఈ యాడ్ లో సితార అట్రాక్షన్ గా నిలిచింది. అప్పుడప్పుడు మహేశ్ సాంగ్ లకు డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక ఇప్పుడు మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేసింది.

సితార చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రోజెన్ 2 సినిమాలో చిన్నారి ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పింది. చిన్నారి స్టెప్పులకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. కాగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రం జనవరి 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహర్షి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం కావడంతో ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు మహేశ్ బాబు అభిమానులు.

- Advertisement -