మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ

643
Vijay Devarakonda
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాధరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే మూవీని చేయనున్నాడు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్‌ని ఎంపిక చేశారు.

తాజాగా విజయ్ తన తర్వాతి మూవీని ప్రారంభించారు. దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్యానర్ లో నిర్మితమయ్యే సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి మజిలీ మూవీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. కాగా దర్శకుడు శివ నిర్వాణ ఇటివలే నానితో టక్ జగదీశ్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేయబోయే సినిమా కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది.

- Advertisement -