అమ్మ పేరిట కొత్త పార్టీ….!

259
- Advertisement -

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. అమ్మకు అత్యంత సమీప బంధువు అయిన శశికళ కు అమ్మకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వం మధ్య అభిప్రాయ బేధాలు భగ్గు మంటున్నాయట. అన్నాడీఎంకే పార్టీ మొత్తం పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవ తీర్మానం చేయగా దానికి శశికళ ఒప్పుకోలేదట,..ముఖ్యమంత్రి పదవిని శశికళ ఆశిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అనుకుంటున్నాయి. కాగా ఈ విషయం పై శశికళ వర్గీయులకు, పన్నీర్ సెల్వం వర్గీయులకు మధ్యే అభిప్రాయబేధాలు సైతం ఏర్పడ్డాయట.

Amma Jayalalithaa New Party

ప్రస్తుతం అన్నాడీఎంకే‌లో శశికళ చక్రం తిప్పుతుండగా ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నుంచి మంత్రుల వరకు ముప్ప తిప్పలు పడుతున్నారట, శశికళను వ్యతిరేకించే వర్గం కూడా తాజాగా తెరపైకి వచ్చిందట. అన్నాడీఎంకే కేసులను సుప్రీం కోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి జయలలిత పేరుతో కొత్త పార్టీ ప్రకటించినట్టు తమిళనాడులో ఓ ఆడియో హల్‌చల్ చేస్తోంది. శశికళకు గిట్టని ఆయన ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్తపార్టీ పెట్టనున్నారని తమిళనాడులో వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా జయలలిత అన్న కుమార్తె దీపను అధ్యక్షురాలిగా నియమించనున్నట్టు కృష్ణమూర్తి ఆ ఆడియో తెలిపారు.

Amma Jayalalithaa New Party

అయితే ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని. అన్నాడీఎంకేతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని, ఆమె మద్దతుదారులు తనను చంపుతానని బెదిరించారని కృష్ణమూర్తి వాపోయారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం గమనార్హం.

Amma Jayalalithaa New Party

ఇక జ‌య‌ల‌లిత కన్నుమూసిన త‌రువాత మొదటి సారిగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం అధ్యక్ష‌త‌న ఈ రోజు రాష్ట్ర‌ కేబినెట్ భేటీ జ‌రిగింది. కేబినెట్‌ సమావేశానికి ముందు జ‌యల‌లిత స‌మాధి వద్ద ప‌న్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోదముద్ర వేశారు. జ‌య‌ల‌లిత పేరిట మెరీనా బీచ్ వ‌ద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జ‌య‌ల‌లిత రాష్ట్రంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను నిర్విఘ్నంగా కొన‌సాగించాల‌ని కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌య‌ల‌లిత స్మార‌క విగ్ర‌హాల ఏర్పాటు చేయాలని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

- Advertisement -