జీవాను చూసి మురిసిపోతున్న ధోని

143
Dhoni daughter Ziva’s Cute Photo

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికింది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. భార్య సాక్షి..కూతురు జీవా ధోనితో కలిసి ఇనిస్టాగ్రాంలో చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Dhoni daughter Ziva’s Cute Photo

ధోని ముద్దుల కూతురు జీవా ధోని ఫొటో షూట్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ధోనికి బైకులంటే ఎంతో మోజు. మార్కెట్లోకి ఏదైనా కొత్త బైక్ వచ్చిందంటే చాలు దానిని వెంటనే ధోని కొనేస్తుంటాడు. అంతేకాదు వాటికి సంబంధించిన చిత్రాలను కోసం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు. ధోని వద్ద సాధారణ బైకుల నుంచి ఖరీదైన స్పోర్ట్స్‌ బైకుల వరకు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సోషల్ మీడియాలో ధోని కూతురు జీవా దర్శనమిచ్చింది. జీవా ధోని బైక్‌పై కూర్చొని ఉన్న ఫొటోను ధోని సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అప్పట్లో ఈ ఫొటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. తాజాగా ధోని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మరో కొత్త ఫొటోను పోస్ట్‌ చేశారు.

Dhoni daughter Ziva’s Cute Photo

ఈ ఫోటోలో ఆయన గారాల పట్టి పింక్‌ కలర్‌ లాంగ్‌ఫ్రాక్‌ వేసుకుని యువరాణిలా తయారై పాతకాలం ఫోన్‌ పట్టుకుని మాట్లాడుతున్నట్లు పోజిచ్చింది. ఈ ఫొటోను ధోని పోస్ట్‌ చేసిన వెంటనే అభిమానులు తెగ లైక్స్‌, కామెంట్స్‌ చేశారు. యువరాణి ముద్దుగా ఉంది, ఫొటో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు అని కొందరు కామెంట్స్‌ చేస్తే.. మరికొందరు జీవా ధోని ఫోన్లో మాట్లాడుతూ ‘డాడీ.. డాడీ నాకు మరో ప్రపంచ కప్పు కావాలి’ అని అంటోందని పోస్ట్‌ చేశారు. ధోని ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన 24 గంటల్లో దాదాపు 5 లక్షల 33 వేల మంది లైక్‌ చేశారు. ధోని కూతురా ఆ మజాకా..

Dhoni daughter Ziva’s Cute Photo

Dhoni daughter Ziva’s Cute Photo

Dhoni daughter Ziva’s Cute Photo

Dhoni daughter Ziva’s Cute Photo