మహేష్….. ‘సంభవామి’..!

100
Sambhavami Title ForMahesh movie!

సూపర్ స్టార్ మహేష్ బాబు… మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిలే ఖరారు కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్…రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాదాపు 26 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ అమ్ముడు కావటంతో ఇండస్ట్రీ వర్గాలు ఖంగుతిన్నాయి.

ఇక మహేష్ ప్రస్టెజియస్ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ పై రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. మొదటగా ఎనిమీ.. ఆ తర్వాత వాస్కోడిగామా.. రీసెంట్ గా అభిమన్యుడు,ఏజెంట్ శివ అనే టైటిల్స్ సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు యూనిట్ ఖండిస్తూనే ఉంది కానీ.. ఇప్పుడో కొత్త టైటిల్ సర్క్యులేట్ అవుతోంది.

Sambhavami Title ForMahesh movie!

మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామీ అనే టైటిల్ను నిర్ణయించారట. ఈ సినిమా నిర్మాతలు ఈ టైటిల్ను రిజిస్టర్ చేయటంతో మహేష్ బాబు సినిమా కోసమే ఈ టైటిల్ను రిజిస్టర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే మహేష్ సినిమా కోసమే సంభవామి టైటిల్ను రిజిస్టర్ చేశారా..? లేక మరో ప్రాజెక్ట్ కోసమా..? అన్న సంగతి తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 2017లో సమ్మర్ కానుకగా మహేష్ రాబోతున్నాడు.