గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన జగిత్యాల జిల్లా కలెక్టర్

501
Collector Sharath
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ నేడు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ చాలెంజ్ అను సంతోషంగా స్వీకరించి ఐదు మొక్కలు నాటారు. అదేవిధంగా కలెక్టర్లు నల్గొండ, నిజామాబాద్, జోగులాంబ, అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల కోరుట్ల శాసనసభ్యులు సాగర్ రావు, మెట్పల్లి సబ్ కలెక్టర్ గ్రీన్ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు.

ఈసందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు. జిల్లాలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు.

- Advertisement -