తన సినిమాలతోను …సోషల్ మీడియాలో పోస్టింగులతోనూ సంచలనాలను సృష్టించే రాంగోపాల్ వర్మ పలు బయోపిక్ లు , యదార్ధ సంఘటనల ఇతివృత్తంతో సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. శివ చిత్రం మొదలుకొని ఇప్పటివరకు వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అగ్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.
ఇక టైటిల్ ను బట్టి చూస్తే ఇది రెండు బలమైన సామాజిక వర్గాలకు మధ్య జరిగే ఇతివృత్తం అని అనుకుంటారు. కానీ ఈ చిత్ర కధాంశం అది కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని చిత్ర బృందం తెలిపింది. ఇక ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ఆదివారం ఉదయం విడుదల కానుంది.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావచ్చిన ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉంటాయి. మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలలో సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర బృందం వెల్లడించింది.