నేను ఐటెంను కాదు…

649
- Advertisement -

గతంలో సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్ చేసేందుకు ప్రత్యేకంగా ఐటెమ్‌ భామలు ఉండేవారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని దగ్గర్నుంచి నిన్నటి మొమైత్‌ ఖాన్‌ వరకు అందరూ స్పెషలిస్ట్‌ ఐటెమ్‌ గాళ్స్‌గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఇప్పుడా పంథా పూర్తిగా మారిపోయింది. స్టార్‌ హీరోయిన్లే ఐటెమ్‌ పాటల్లో మెరవడానికి సిద్ధపడుతున్నారు. రెండు, మూడ్రోజులు షూటింగ్‌ల్లో పాల్గొని కోటి రూపాయలు దక్కించుకుంటున్నారు. అందాల ఆరబోస్తు ఐటం సాంగ్స్ అయితే చేస్తున్నారు కానీ..ఐటెమ్‌ భామలుగా పిలిపించుకోవడానికి మాత్రం సిద్ధపడడం లేదు. దీంతో ఐటెమ్‌ సాంగ్‌ కాస్తా స్పెషల్‌ సాంగ్‌గా మారిపోయింది.

Anchor Anasuya

ఇదే విషయంపై బుల్లితెర యాంకర్ ఓ అభిమానిపై సీరియస్ అయిందట. ఓ వైపు యాంకర్‌ గా బుల్లితెరపై తెగ సందడి చేస్తున్న అనసూయ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తున్న విషయం తెలిసింది. తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’ సినిమాలో ఓ సాంగ్‌లో ఆడిపాడింది హాట్‌ యాంకర్‌ అనసూయ. అయితే ఆమె ఆన్‌లైన్‌ లైవ్‌ షోలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు విన్నర్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్నారట కదా’ అని అడిగాడు.

Anchor Anasuya

ఈ మాటకు అనసూయ తెగ సీరియస్‌ అయిపోయింది. ‘ఐటెమ్‌ ఏంటి? అసలు ఐటెమ్‌ అంటే అర్థం ఏమిటి? ఐటెమ్‌ అంటే వస్తువు అని అర్థం. ఆడవాళ్లు నీకు వస్తువులా కనబడుతున్నారా? మీ ఆనందం కోసం స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తున్నారంతే..దయచేసి అలాంటి పాటలను ఐటెమ్‌ సాంగ్స్‌ అని పిలవొద్దం’టూ క్లాస్‌ పీకింది.

- Advertisement -