మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణిత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 149పరుగులు చేసింది. కెప్టెన్ క్వింటన్ డికాక్ 52, తెంబా బవుమా 49 పరుగులు చేశారు.
మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆ తర్వాత 150పరుగులు లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత ఆటగాళ్లు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 40పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లి 72 పరుగులు చేసి కీలకంగా నిలిచాడు.
ముఖ్యంగా కోహ్లి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు . 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ నెల 22న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది.