బిగ్ బాస్ నుంచి అలీ రెజా అవుట్.. నాని ఎంట్రీ

545
alireza Biggboss
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ షో మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతీ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ఈవారం ఎలిమినేషన్ లో శ్రీముఖి, మహేశ్, రాహుల్, రవి కృష్ణ, అలీ రెజా లు ఉన్నారు. ప్రతి వారంలాగే ఈవారం కూడా ఒక రోజు ముందుగానే ఎవరు ఎలిమినేట్ అయ్యే వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈవారం అలీ రెజా ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తుంది.

ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ టైం ఎలిమినేషన్ నామినేషన్‌లోకి వచ్చిన అలీ రెజా.. ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ది బెస్ట్ కంటెస్టెంట్ అని పేరున్న అలీకి టెంపర్, అగ్రెసివ్‌నెస్ ఎక్కువ. ఇక ఈ కారణాల వల్లే అలీ రెజాకు ఓట్లు తక్కువగా పడినట్లు తెలుస్తోంది.

కాగా ఫస్ట్ సీజన్‌లో కూడా ప్రిన్స్ ఫస్ట్ టైం ఎలిమినేషన్స్‌లో వచ్చిన వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఈవారం నాని కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కొద్ది సేప‌టి క్రితం స్టార్ మా ప్రోమోని విడుద‌ల చేసింది. నా..ని… టీవీ అంటూ ఇంటి స‌భ్యుల‌కి స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. నాని తన నటించిన గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కు వచ్చాడని తెలుస్తుంది.

- Advertisement -