వినాయక చవితి పండగ రావడంతో భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కొలాహంలంగా ఉంది. ఇక నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలిసిందే. అక్కడ భారీ విగ్రహాన్ని ప్రతి ఏటా నిలుపుతారు. తొమ్మిది రాత్రుళ్లు పూజలు నిర్వహించి ట్యాంక్ వద్ద హుసేన్‌సాగర్‌లో వినాయకుడిని నిమర్జనం చేస్తారు. ఈ నిమర్జన కార్యక్రమం కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరుగుతుంది. మరో వారం రోజుల్లో ఈ నిమర్జన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. వీరితో పాటు సంబంధిత డిపార్ట్మెంట్‌ల అధికారులు కూడా పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎన్.టి.ఆర్ మార్గ్‌లో కంట్రోల్ రూమ్‌ను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్ ప్రారంభించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… వినాయక చవితి పండుగ అనగానే ఒకప్పుడు బొంబాయి, పూణే గురించి మాట్లాడుతూ ఉండే కానీ ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామని మంత్రి అన్నారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము. ఖైరతాబాద్ వినాయకుడి పూర్తిగా నిమజ్జనం జరిగే విధంగా హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కార్యక్రమానికి చాలా మంది భక్తులు చూసేందుకు తరలివస్తారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు.. అన్ని ఏర్పాట్లు చేసిన అందరిని అభినందిస్తున్నామని మంత్రి తలసాని అన్నారు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు గర్వించే విధంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేసినం.కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మానిటరింగ్ చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తారని మేయర్ అన్నారు.ఖైరతాబాద్ వినాయకుడి పూర్తిగా నిమజ్జనం అయ్యేందుకు ఇప్పటికే నిమజ్జనం జరిగే ప్రదేశంలో చెత్త చెదారం తీసివేస్తున్నారు.ఎక్కడ పొరపాట్లు జరగకుండా మళ్ళీ ఒక్కసారి సరిచేసుకొని నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాం.