రాజ్ తరుణ్‌ కారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్వీస్ట్..

327
Raj tarun
- Advertisement -

హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో మరో కొత్త ట్వీస్ట్ నెలకొంది. యాక్సిడెంట్ కేసు కాస్త ఇప్పుడు హత్యాయత్నం, బెదిరింపుల కేసుగా మారింది. కారు యాక్సిడెంట్ చిత్రికరించిన ఓ వ్యక్తిని రాజ్ తరుణ్ మనుషులు బెదిరించడం ఇప్పడు సంచలనం రేపుతుంది. ఆదివారం రాత్రి హీరో రాజ్ తరుణ్ తన కారుని అల్కాపురి టౌన్ షిప్ దగ్గర ఒక గొడకి ఢికొట్టాడు. అత్యంత వేగంతో దూసుకోచ్చిన కారు యూటర్న్ తీసుకునే సమయంలో అదుపుతప్పింది. కారు గొడను గుద్దగానే రోడ్డు కిందకి కారుని దింపి రాజ్ తరుణ్ అక్కడ నుంచి పారిపోయాడు.

అయితే వ్యవహారం మొత్తాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ చేయడమే కాకుండా కార్తీక్ అనే వ్యక్తి తన ఫోనుతో చిత్రికరించాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. యాక్సిడెంట్ చేసి పారిపొతున్న రాజ్ తరుణ్ ను వీడియో తీస్తున్న కార్తీక్ ను చేజ్ చేసి పట్టుకున్నారు. యాక్సిడెంట్ చేసి ఎందుకు పారిపొతున్నావ్ అని రాజ్ తరుణ్‌ ని నిలదీశాడు. కారు తనది కాదని అందుకే అక్కడి నుంచి పారిపొతున్నట్లు కార్తీక్ కు చెప్పాడు రాజ్ తరుణ్. దీంతో చాలా సేపు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలంలో తాను తీసిన వీడియోను డిలీట్ చేయాలని రాజ్ తరుణ్ తనను కోరినట్టుగా కార్తీక్ మీడియాకు తెలిపారు. తరువాతి రోజు తనకు తన మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేస్తాడని రాజ్ తరుణ్ చెప్పారని… రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే రాజా రవీంద్ర తనకు ఫోన్ చేశారని కార్తీక్ తెలిపారు. ఈ వీడియోలను డిలీట్ చేస్తే తననకు డబ్బులు ఇస్తారని చెప్పారని ఆయన తెలిపారు. ఓ మహిళ తనకు ఫోన్ చేసి ఈ వీడియోలను డిలీట్ చేయాలని కోరిందన్నారు. ఈ విషయమై ఆమె తనను అసభ్యంగా దూషించిందని కూడ ఆయన ఆవేదన చెందారు.

- Advertisement -