మెట్రో ప్రయాణికులకు శుభావార్త తెలిపారు ఎండీ ఎన్వీయస్ రెడ్డి. హైటెక్ సిటీ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు రివర్స ల్ సిస్టం ను ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇంతకు ముందు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ సిస్టం ద్వారా రైళ్ళను నడిపించారు. రివర్సల్ సిస్టం అందుబాటులోకి రావడంతో రద్దీగా ఉన్న సమయాల్లో అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 4నిముషాలకు ఒక మెట్రో రైలు నడుపనున్నట్లు తెలిపారు.
ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కారిడార్ లో 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నామని చెప్పారు. రివర్సల్ సిస్టం అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
హైటెక్ సిటీ- అమీర్ పేట్ కారిడార్ లో రెండు మూడు వారాల వరకు 4నిముషాలకు ఒక రైలును నడుపనున్నన్నట్లు తెలిపారు. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి ప్రతి మూడు నిముషాలకు ఒక ట్రైన్ ను నడుతామని చెప్పారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఏసీ టెంపరేచర్ ను 23డిగ్రీలకు తగ్గించామన్నారు.