కుప్పకూలిన కాఫీ డే షేర్లు…

389
Coffee Day
- Advertisement -

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు,  కాఫీ  డే యజమాని వీజీ సిద్ధార్ధ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నేత్రావతి నది ఒడ్డున సిద్ధార్థ మృతదేహన్ని కనుగొన్నారు పోలీసులు. ఆదాయపన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఒకరి నుంచి వేధింపులు భరించలేకపోతున్నాను… అందుకే నా పోరాటం ఆపేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు సిద్ధార్థ్.ఇక సిద్ధార్థ్ మృతితో విషాదం నెలకొనగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సిద్ధార్థ మరణంతో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కంపెనీ షేరు విలువ 20శాతం కుంగింది. ట్రేడింగ్‌ ఆరంభమైన కాసేపటికే కంపెనీ షేర్లు మళ్లీ 20శాతం పతనమయ్యాయి.

బీఎస్‌ఈలో షేరు ధర 52 వారాల కనిష్ఠానికి తగ్గి రూ. 123.25గా ఉంది. ఎస్‌ఎస్‌ఈలోనూ ఏడాది కనిష్ఠాన్ని తాకి రూ. 122.75 వద్ద ట్రేడ్‌ అయ్యింది.

- Advertisement -