ప్రేమమ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో కుర్రకారును ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారి తన కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం నిన్ను కోరి రిమేక్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
రెండేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తమిళ్లో రీమేక్ కానుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించే అవకాశాన్ని కొట్టేసింది.
ఈ చిత్రానికి కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా నాని పాత్రలో హీరో అధర్వ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేస్తూ అనుపమ పాత్రని ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ గా మలచనున్నాడట దర్శకుడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోలీవుడ్‌లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో వేచిచూడాలి.