అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల భేటీ..

359
minister niranjan reddy
- Advertisement -

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అధ్యక్షతన షిండే హాల్‌లో సోమవారం అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రవేశ పెట్టిన పథకాలు, వ్యవసాయ రంగ అభివృద్ధి కి సంబంధించిన 7 అంశాలు ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగనుంది.

minister thomar

సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలు..

1. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి
2. పిఎం కిసాన్ మన్ ధాన్ యోజన
3. కిసాన్ క్రెడిట్ కార్డు
4. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
5.అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్స్
6. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మార్కెట్ కమిటీ
7. ఆర్గానిక్ ఫార్మింగ్

niranjan reddy minister

ఇక ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ రాహూల్ బొజ్జా పాల్గొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించనున్నారు.

- Advertisement -