జులై 16న చంద్ర గ్రహణం.. పాటించవలసిన పద్దతులు..

704
- Advertisement -

ఈ నెల 16 వ తేదీ రాత్రి మంగళవారం ఆశాఢ శుద్ధ పౌర్ణమి ( గురు పౌర్ణమి ) రోజున ( అనగా తెల్లవారితే 17 వ తేదీ ) ఉత్తరాశాడా నక్షత్ర యుక్త కేతు గ్రస్త ఖండ గ్రాస చంద్ర గ్రహణం భారత దేశంలో సంభవిస్తుంది.

-స్పర్శ సమయం : రా. 1.35 ని.లు
-మధ్యమ సమయం : రా. 3.03 ని.లు
-విడుపు సమయం తె. 4.32 ని.లు

-మొత్తం గ్రహణ సమయం 2.గం..57 ని.లు
-ఈ రోజున దేవాలయాల్లో ఇంట్లో నిత్యపూజలు అభిషేకాలు అన్ని మ. 1 లోపు ముగించుకోవాలి.
-మ. 3 తర్వాత దేవాలయాలు మూసి వేసి మరుసటి రోజున సూర్యోదయంతో తెరచి సంప్రోక్షణ గావించుకోవాలి.
-16 17 తేదీల్లో ఆబ్దికాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు.
-గర్భిణీ స్త్రీలు గ్రహణ వేధ ప్రారంభం నుండి గ్రహణ మోక్షకాలం వరకు బయటకి రాకపోతే చాలు. ఇంట్లో రోజూ ఉన్న విధంగానే ఉండవచ్చు. ఇతర నియమాలు అవసరం లేదు.
-గ్రహణ సమయం చాలా శక్తివంతమైనది కనుక ఆరోగ్యవంతులు గ్రహణ సమయంలో తమ శక్తికొలది మూల మంత్రం జపించుకుంటే చాలా విశేషం.
-గ్రహణ కిరణాలు పడి వండిన పదార్థాలు విషపూరితం అవుతాయి అన్న కారణం చేత గ్రహణ కాలంలో భోజనాలు చేయకూడదు అని పూర్వం చెప్పిన మాట.
-గ్రహణ కిరణాలు పడకుండా జాగ్రత్త పడితే కనుక ఆ ఆహారము తినడానికి ఎలాంటి భయం అవసరం లేదు.

eclipse
-ఈ గ్రహణం వలన ఏ జాతకులకు ఎలాంటి కీడు కలుగదు. గ్రహణం సంభవిస్తున్న నక్షత్ర జాతకులు తమ జాతంకంలో కూడా ఇప్పుడు నడుస్తున్న దశ అంతర్దశలు బాగా లేకపోతేనే ఆ గ్రహణ ప్రభావం మీ మీద ఉంటుంది. ఈ కారణం చేత గ్రహణ పరిహారాలు Universal గా చెప్పడం సరికాదు.
-శక్తికలిగిన వారు వెండి / బంగారం కేతు ప్రతిమ, వెండి / బంగారు చంద్రుడి ప్రతిమ, బియ్యము, ఆవునేయి, నల్లనువులు, కాంస్య పాత్ర, తెల్లని వస్త్రం సంకల్ప పూర్వకంగా దానం ఇవ్వాలి.
-సంకల్పం లేకుండా ఇచ్చే దానం వ్యర్థం.

ఈ సంకల్పం దానం ఎలా చేయాలి..?

ఆచమనం చేసి ఆరోజు తిథి వార నక్షత్రాలు చెప్పుకొని దానం తీసుకునే వ్యక్తిని పడమటి ముఖంగా కూర్చోబెట్టి అతనికి అలంకరణ, అర్చన, అర్ఘ్య పాద్య ఆచమనాలు ఇచ్చి మీ పేరు ( దానం ఇచ్చేవారు ) గోత్రము నక్షత్రము, చెప్పి దానం తీసుకొనే వ్యక్తిని కూడా తన గోత్రము పేరు చెప్పించి కింది శ్లోకం చెప్పాలి.

శ్లోకం:మమ జన్మరాశి ( దానం ఇచ్చేవారి రాశి ), జన్మ నక్షత్ర ( ఉత్తరాషాఢ నక్షత్రం ) స్థిత, కేతు గ్రస్త చంద్ర గ్రహణ సూచిత, సర్వారిష్ట శాంతి పూర్వకం, ఏకాదశ స్దాన ఫలిత శుభ ఫలిత ప్రాప్తి అర్ధం గ్రహణ సూచిత దానం అహం కరిష్యే !

చంద్ర గ్రహ ధ్యానం :

దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం!
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం !!

కేతు గ్రహ ధ్యానం

ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!!

అను మంత్రముచే చదివి గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమీయవలయును.

-ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన.. విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు ఆచరించవలెను.

- Advertisement -