“సైరా” షూటింగ్ పూర్తీ..

321
SyeRaa
- Advertisement -

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్‌ సేతుపతి, నయనతార వంటి బడా స్టార్లు కూడా భాగమయ్యారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్ర షూటింగ్ ఇటివలే పూర్తీ చేసుకుంది. ఈవిషయాన్ని ఈచిత్ర కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన ‘సైరా’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈసినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -