క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ పండగ మొదలు కానుంది. ఐపీఎల్-2020 కోసం అన్ని సిద్దం చేస్తున్నారు. కాగా నేడు కోల్‌కతాలో జరగనున్న ఐపిఎల్ క్రీడాకారుల వేలంలో 713 మంది భారతీయులు, 258 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 971 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారు.
215 మంది క్యాప్డ్ ఆటగాళ్ళు, 754 మంది ఎంపిక చేయనివారు మరియు అసోసియేట్ నేషన్ నుండి ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటివరకు తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లను క్యాప్డ్ ప్లేయర్లని, లేకుంటే అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా పిలుస్తారు.
ఈనెల 9న ఆన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించగా..ప్లేయర్ రిజిస్ట్రేషన్ నవంబర్ 30తో ముగిసింది. అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 55, సౌతాఫ్రికా నుంచి 54 మంది ఆటగాళ్ల వేలంలో పాల్గొంటున్నారు. అసోసియేట్ దేశాలు నెదర్లాండ్స్, అమెరికా నుంచి ఒక్కొక్కరు తమ పేరును నమోదు చేసుకున్నారు. క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లు 19 మంది కాగా.. అన్‌క్యాప్‌డ్ భారత క్రికెటర్లు 635 మంది ఉండటం విశేషం.
ఆఫ్ఘనిస్తాన్ (19), ఆస్ట్రేలియా (55), బంగ్లాదేశ్ (6), ఇంగ్లాండ్ (22), నెదర్లాండ్స్ (1), న్యూజిలాండ్ (24), దక్షిణాఫ్రికా (54), శ్రీలంక (39), యుఎస్‌ఎ (1), వెస్టిండీస్ (34), జింబాబ్వే (3) ఆటగాళ్లు ఈ వేలం ప్రక్రియలో పాల్గొననున్నారు.
The VIVO IPL Player Registration closed on 30th November with 971 players (713 Indian and 258 overseas players) signing up to be a part of the VIVO IPL..