మరో వివాదంలో ఆనందయ్య మందు..

124
anandiah
- Advertisement -

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ఆనందయ్య మందు కోసం  ఇతర ప్రాంతాల నుంచి   ప్రజలు రావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌కు  మందు తయారు చేశానని ఆనందయ్య ఇటీవల ప్రకటించడంతో ప్రజలు కృష్ణ పట్నం గ్రామానికి భారీగా తరలివస్తున్నాందున మా పిల్లలు మేము అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్థులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆనందయ్య కు జాయింట్ కలెక్టర్ హెల్త్ నోటీసు జారీ చేయ్యాలని ముత్తుకూరు మండల తహసీల్దార్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముత్తుకూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది సమక్షంలో తహసిల్దార్ సోమ్లా నాయక్ ఆనందయ్య కు నోటీసు డ్రగ్స్ అండ్ మాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954, మరియు డిశాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మీవద్ద ఎటువంటి అనుమతులు లేని ఎడల మీరు పై మందు గురించి ప్రచారం కానీ పంపిణీ కానీ చేయడానికి అనర్హులు అని ఒమిక్రాన్ కు మందు తయారు చేశామని, 48 గంటల్లో ఒమిక్రాన్ వ్యాధి ని తగ్గిస్తామని ప్రకటన పై అనుమతులు లేని ఎడల పై తెలిపిన చట్టాల ప్రకారం మీ పైన తగు చర్యలు తీసుకొనుబడునని హెచ్చరిక జారీ చేస్తూ 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన్ని కోరారు.

గతంలో ఆనందయ్య వద్ద కోవిడ్ మందు తీసుకు వెళ్లటానికి ఇతర రాష్ట్రాల  నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.  చాలా మంది రోగులు అంబులెన్స్ లో కూడా వచ్చి తీసుకు వెళ్లారు. అంతమంది ప్రజలు  ఊళ్లోకి రావటంతో   గ్రామస్తులకు కోవిడ్   సోకి కొందరు మరణించారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.   మరో వైపు ఆనందయ్య తన కోవిడ్ మందుకు కోర్టు అనుమతి ఇచ్చిందనే విషయాన్ని గుర్తు  చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే ఒమిక్రాన్ మందు  కూడా   కోవిడ్ లో   భాగమేనని ఆనందయ్య అంటుండగా పోలీసులు, గ్రామస్తులు అందుకు ఒప్పుకోవటంలేదు.*

ఒమిక్రాన్ మందుకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిందేనని… గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు  గూమి గూడటానికి  వారు ఒప్పుకోవటం లేదు.   తాను స్వఛ్చందంగా ఉచితంగా   ఒమిక్రాన్  మందు పంపిణీ   చేస్తుంటే గ్రామస్తులు ఎందుకు అడ్డుకుంటున్నారో   తెలియటం  లేదని ఆనందయ్య అన్నారు.  ఇప్పుడు ఒమిక్రాన్ మందు పంపిణీ చేయవద్దని   అనే  వారంతా గతంలో తన వద్ద కోవిడ్ మందు వాడి…. ఇతరులకు కూడా పంపిణీ చేశారని ఆనందయ్య వెల్లడించారు.  తానేమీ మందు పంపిణీ చేస్తూ   డబ్బులు వసూలు  చేసుకోలేదని… తన బ్యాంకు  ఖాతాలు కూడా చెక్  చేసుకోవచ్చని ఆనందయ్య చెప్పారు.

- Advertisement -