దేశంలో 24 గంటల్లో 90,928 కరోనా కేసులు..

58
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 325 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,43,41,009కి చేరగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,85,401గా ఉంది. కరోనాతో ఇప్పటివరకు 4,82,876 మంది మృతిచెందారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.46 శాతంగా ఉండగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 148.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.