అమెరికాలో అగ్నిప్రమాదం…13 మంది మృతి

101
us

అమెరికాలో ఫిలడెల్ఫియాలో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించగా ఏడుగురు పిల్లలతో సహా సుమారు 13 మంది మృతి చెందారు. మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది 50 నిమిషాల పాటు శ్రమించారు.

భవనంలో నాలుగు స్మోక్‌ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అవి విఫలమవ్వడంతోనే పిల్లలతో సహా 13 మంది చెందారని ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ క్రమంలో ఎనిమిది మంది రెండు ఎగ్జిట్‌ మార్గాల గుండా ప్రాణాలతో బయటపడగలిగారని అధికారులు వెల్లడించారు. ఈ భవనంలో సుమారు 26 మంది నివసిస్తుండగా మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.