- Advertisement -
మధ్య్రప్రదేశ్ లోని శివపురి, గ్వాలియర్ సరిహద్దుల్లోని పోల్ దగ్గరున్న పిక్నిక్ స్పాట్ లో ఘోర ప్రమాదం జరిగింది. సరదాగా పిక్నిక్ కు వెళ్ళిన ఓ మిత్రబృందం క్షణాల్లో వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న(16-08-2018) సెలవుదినం కావడంతో పదుల సంఖ్యలో అక్కడికి యువత చేరుకుంది. జలపాతం వద్ద వారంతా ఆనందంగా గడుపుతున్నసమయాన , ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. నీటిని చూసి భయంతో 30 మంది ఓ రాతి పై భాగాన చిక్కుకుపోగా, మరో 12 మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీటిలోనే నిలబడ్డారు.
అయితే క్షణాల్లో వరద ఉద్రృతి పెరగడంతో జలపాతంలో పడిపోయారు. రాతిపై చిక్కుకున్న వారిలో 8 మందిని రెస్క్యూటీమ్ హెలికాఫ్టర్ సాయంతో కాపాడారు. కాగా.. గల్లంతైన 12 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -