85 వేల నియామకాలు.. ప్రతివారం సమీక్ష

216
85,000 government jobs to fill in Telangana soon
85,000 government jobs to fill in Telangana soon
- Advertisement -

న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా నోటిఫికేషన్లు జారీచేసి, నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులతో సీఎం మాట్లాడారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందే న్యాయశాఖతో చర్చించాలని, ఎవరైనా కోర్టు కేసులు వేస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేపట్టినా అడ్డుకోవడానికి కొన్ని ప్రతీపశక్తులు కాచుకొని కూర్చున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

kadiyam-srihari

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీ చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇప్పటి వరకు ఐదువేల మంది నియమితులయ్యారని, మరో నెల వ్యవధిలో 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని సీఎంకు తెలిపారు. న్యాయపరమైన వివాదాలు కూడా కొలిక్కి వచ్చాయని, త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు ప్రకటిస్తామని సీఎంకు ఘంటా వివరించారు.

.12 లక్షలకు పైగా నియామకాల లక్ష్యాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులు కనీసం వారానికి ఒకసారి సమావేశమై, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లినందున ఆ కేసులకు సంబంధించి కూడా న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు.

- Advertisement -