- Advertisement -
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించగా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.
కరోనాతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల 53 వేల మంది మృత్యువాతపడగా 2,10,91,079 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 64,19,775 యాక్టివ్ కేసులు ఉండగా, 1,39,17,825 మంది కోలుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో 1,70,415 మంది మరణించగా, 1,05,564 మరణాలతో బ్రెజిల్,55,293 మృతులతో మెక్సికో, 47,033 మందితో భారత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
అమెరికాలో 64,15,666 మంది కరోనా బారినపడగా, బ్రెజిల్లో 32,29,621, భారత్లో 24,59,613, రష్యాలో 9,07,758,దక్షిణాఫ్రికాలో 5,72,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -