దేశంలో కొత్తగా 10,064 మందికి కరోనా..

160
India Covid cases
- Advertisement -

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 10,064 మందికి కరోనా నిర్ధారణ అయింది. గడచిన 24 గంట‌ల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,556కు పెరిగింది.

అదే స‌మ‌యంలో 17,411 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,81,837కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,28,753 మంది కోలుకున్నారు. 2,00,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

- Advertisement -