వరుస విజయాలతో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకొస్తే.. ‘గీత గోవిందం’ సినిమాతో వంద కోట్ల మైలు రాయిని చేరుకున్నాడు విజయ్. దీంతో విజయ్ మార్కెట్ మూడింతలు పెరిగిపోయింది. ఇప్పుడు విజయ్ రెమ్యునరేషన్ యంగ్ హీరోలందరికంటే ఎక్కువ. దాదాపు రూ.10 కోట్లు అతడికి పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం నోటా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్‌ను విజయవాడలో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఈ ఫంక్షన్‌లో విజయ్ అభిమానుల జోరు చూస్తుంటే త్వరలోనే విజయ్ టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల జాబితాలోకి చేరతాడేమో అన్నంతగా ఆశరేకెత్తక మానదు.
ఎటువంటి బ్యాకింగ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువ హీరోకు యువత ఇలా భయంకరంగా అభిమానించేయడం అంటే చాలా ఆశ్చర్యమే. అభిమానులు భారీగా పొటెత్తడంతో ఆడిటోరియం సరిపోలేదు. అయితే ఈ ఫంక్షన్‌లో విజయ్ కూడా అభిమానులను ఉర్రూతలూగించేలా ప్రసంగించాడు. తను చేసిన నాలుగు సినిమాల్లో మూడు ఆడాయి, ఒకటి దొబ్బేసింది అని నిర్మొహమాటంగా చెప్పేసాడు. అమరావతి రాజధాని వంటి వ్యవహారాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకటే భావన వంటి పెద్ద మాటలు కూడా మాట్లాడాడు విజయ్‌దేవరకొండ. విజయవాడకు మళ్లీ వస్తానని, ఆ ఫంక్షన్‌ను పెద్ద ఆడిటోరియంలో నిర్వహించుకుందామని, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే నోటా సినిమా తనకు మరో హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు విజయ్. నోటా సినిమా టాక్ పాజిటివ్‌గా ఉంటే ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయేలా ఉంటాయని విజయ్ చెప్పుకొచ్చాడు.