దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్,జూన్ 4న కౌంటింగ్ జరగనుందని వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను నిర్వహిస్తామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్.ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు.ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 48 వేలు,దివ్యాంగులు 88 లక్షల మందిఓటర్లు ఉన్నారన్నారు.ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామన్నారు.ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపడతామన్నారు.టీవీ, సోషల్ మీడియా ప్రక్రటనలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కానుకలను, ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారంలో ఎవరూ హద్దుమీరి వ్యాఖ్యలు చేయవద్దు అన్నారు.
Also Read:వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే…