ఊరూరా ..ఆరో విడుత హరితహారం

501
haritha haram
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 6వ విడత హరితహరం కార్యక్రమం ప్రారంభమైంది. పలువురు ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ ములోని 9 వ వార్డ్ లోని పార్క్ లో మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యూగేందర్ రావు, కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఎస్పీ ఆర్. భాస్కరన్,మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ,మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ ర్ లు టి.ఆర్.యస్ నాయకులు. కార్యకర్తలు పాల్గోన్నారు.

సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారం ఆరో విడతలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గోన్నారు. మరోవైపు గజ్వెల్ మండలం బూరుగుపల్లి లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ.

హరితహారం పేరిట తెలంగాణను హరిత వనంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలకేంద్రంతోపాటు,గానుగుమర్ల తండా, రావిచెడ్ గ్రామాలలో 6వ విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -