సంచలన రిపోర్ట్..కరోనాతో ఇప్పటివరకు ఇంతమంది చనిపోయారా..!

134
covid
- Advertisement -

కరోనా మహమ్మారి పీడ ఇంకా తొలగిపోలేదు. కొన్నిదేశాల్లో థర్డ్ వేవ్ రూపంలో కరోనా ప్రజలను కబలిస్తుండగా భారత్‌లో మాత్రం సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనాతో ఇప్పటివరకు లక్షల మంది మృతి చెందగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వేదికగా పనిచేస్తున్న స్వతంత్ర ప్రపంచ ఆరోగ్య పరిశోధన సంస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ (ఐహెచ్ ఎంఈ)ఓ సంచలన రిపోర్ట్ ను వెల్లడించింది.

గణాంకాలు 32.64 లక్షల మంది చనిపోయారని చెబుతుండగా ఆ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 69 లక్షల మంది కరోనాతో చనిపోయారని వెల్లడించింది. ఇక భారత్ లో కొవిడ్ మరణాల సంఖ్య 6.54 లక్షలుగా పైగా ఉండొచ్చని పేర్కొంది. ప్రధానంగా తూర్పు ఐరోపా మధ్య ఆసియాలో మరణాలను తక్కువగా చూపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈజిప్ట్ లో ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలున్నట్లు అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. మరణాలు అధికంగా సంభవించడానికి రకరకాల కారణాలున్నాయని చాలామంది ప్రజలు ఆసుపత్రులకు దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఇప్పుడు ఈ సంస్థ వెల్లడించిన షాకింగ్ రిజల్ట్ అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

- Advertisement -