తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుష్ప మూవీ టీం..

48
pushpa

తిరుమల శ్రీవారిని పుష్ప మూవీ టీం దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో‌ పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, నటుడు‌ సునీల్, ప్రొడ్యూసర్ నవీన్ లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపల పుష్ప మూవీ ప్రొడ్యూసర్ నవీన్ మాట్లాడుతూ.. పుష్ప మూవీ ఘన విజయం సాధించడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో పుష్ప సినిమాను ప్రేక్ణకులు ఆదిరించడం ఆనందదాయకం మన్నారు.. మార్చి మొదటి వారంలో పుష్పా రెండోవ విభాగం షూటింగ్ ప్రారంభం అవుతుందని డైరెక్టర్ సుకుమార్ తెలియజేశారు.