శ్రీలంకలో బాంబు దాడి.. 50 మంది మృతి

203
Blasts In Sri Lanka's Churches
- Advertisement -

ఈస్టర్‌ సండే పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్దరిల్లింది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. మూడు చర్చ్ లు, రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో సుమారు 50 మంది వరకు మృతి చెందగా, 300 మందివరకు క్షతగాత్రులయ్యారని స్థానిక వర్గాల కథనం.

Blasts In Sri Lanka's Churches

పోలీసు అధికారుల వివరాల ప్రకారం.. కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -