వారణాసి చేరుకున్న నిజామాబాద్ రైతులు

309
Nijamabad Formers
- Advertisement -

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మోదీకీ వ్యతిరేకంగా వారణాసి లో నామినేషన్లు వేస్తున్నారు నిజామాబాద్ పసుపు రైతులు. ఈసందర్భంగా నిజామాబాద్ నుంచి స్పెషల్ బస్ లో వారణాసి చేరుకున్నారు రైతులు. మొత్తం 52మంది రైతులు నిజామాబాద్ నుంచి నాందేడ్ బయలుదేరివెళ్లారు. ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం నామినేషన్ల సమర్పణకు మద్దతు దారుల కోసం రైతులు వెతికారు.

స్థానికులను కలిసి సమస్యలు వివరించి తమకు మద్దతు తెలియచేయాలని కోరారు. మరో వైపు వారణాసి లో నామినేషన్ వేయడానికి వచ్చిన రైతులను బీజేపీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు రైతు సంఘం నేతలు. అంతేకాకుండా ఇంటలిజెన్స సిబ్బంది కూడా రైతులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు.

నామినేషన్లు వేయకూడదంటూ రైతులను బెదిరించడమే కాక.. వారికి నామినీలుగా ఉంటామని ముందుకు వచ్చిన స్థానిక రైతులను కూడా పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు అడ్డుకుంటున్నారట. ఇక నిజామాబాద్ రైతులకు మద్దతుగా వచ్చిన తమిళనాడు రైతులను స్థానిక పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. రేపటితో వారణాసిలో నామినేషన్ల గడువు పూర్తి కానుండటంతో ఎంతమంది వారణాసి బరిలో ఉంటారన్నది చూడాలి.

- Advertisement -