హాట్ సమ్మర్‌..కూల్ ఐడియా..విగ్రహాంతో ప్రచారం

208
abhishek statue

ఎన్నికలొస్తే చాలు ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు చేసే హంగామా అంతా ఇంత కాదు.అసాధ్యమైన హామీలు ఇస్తూ, వినూత్న ప్రచారాలు చేస్తూ ముందుకుసాగుతారు. డ్యాన్స్‌లు,దరువు,కురగాయాలు అమ్మడం,టీ స్టాల్‌లో పనిచేయడం,వరినాట్లు వేయడం ఇలా ఒక్కోనేతది ఒక్కో స్టైల్‌. తాజాగా ఓ వైపు ఎన్నికలు మరోవైపు మండుతున్న ఎండలు ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచన చేశాడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు.

ఎండలో తాను తిరగలేక ఏకంగా తన విగ్రహం తానే చేయించి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. బెంగాల్‌లో చోటుచేసుకున్న ఈ వింత ఐడియా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి రెండోసారి బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభిషేక్ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తన విగ్రహంతో ప్రచారం చేస్తూ ముందుకుసాగుతున్నారు. నమస్కసరిస్తున్న ఫోజులో తన బొమ్మను తయారు చేయించి ఓ టాప్ లేని జీపులో తిప్పేస్తున్నాడు. అభిషేక్ విగ్రహాన్ని చూసి అక్కడి స్థానికులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

అభిషేక్ తృణమూల్ కాంగ్రెస్ కీలకనేతగా ఉన్నారు. అఖిల భారత తృణమూల్ యూత్ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగాలకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటవల ఆయన భార్య కోల్‌కతా విమానాశ్రయంలో బంగారం తరలిస్తూ పట్టుబడటంతో అభిషేక్ బెనర్జీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/rishibagree/status/1121810373936443393