దేశంలో 24 గంటల్లో 47,905 కరోనా కేసులు…

227
covid 19
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 47,905 క‌రోనా కేసులు న‌మోదుకాగా 550 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 86,83,917కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 4,89,294 యాక్టివ్ కేసులుండగా 80,66,502 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో 1,28,121 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 92.89 శాతంగా ఉండగా మ‌ర‌ణాల రేటు 1.48 శాతంగా ఉంద‌ని ఐసీఎంఆర్ వెల్ల‌‌డించింది.గత 24 గంటల్లో 11,93,358 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా న‌వంబ‌ర్ 11 నాటికి 12,19,62,509 టెస్టులు చేశామని తెలిపింది.

- Advertisement -