దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…

147
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదుకాగా 607 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరగా ఇప్పటి వరకు 3,17,88,440 మంది కరోనా నుండి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 4,36,365 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 97.63శాతంగా ఉండగా టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 60.38 డోసులు పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -