లీడ్స్ టెస్టులో చేతులెత్తేసిన కోహ్లీ సేన..

160
kohli

లార్డ్స్ టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన కోహ్లీ సేన…లీడ్స్ టెస్టులో మాత్రం చేతులెత్తేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను తీవ్రంగా నిరాశపర్చారు ఆటగాళ్లు. టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే భారత్‌ ఆలౌట్ అయ్యింది. రోహిత్‌ శర్మ 19, రహానె 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్‌ చేయలేదు. అండర్సన్, ఓవర్టన్‌ చేరో మూడు వికెట్లు తీయగా.. కరన్‌, బిన్సన్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

కోహ్లీసేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్‌..బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.