దేశంలో 24 గంటల్లో 41,649 కరోనా కేసులు

65
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,649 కరోనా కేసులు నమోదుకాగా 593 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,13,993కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ కేసులుండగా 3,07,81,263 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,23,810 మంది మృతి చెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేయగా ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 46.64 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.