బీమ్లా నాయక్‌తో మాటల మాంత్రికుడు!

69
trivikram

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఇటీవలె ప్రారంభమైంది. బీమ్లానాయక్‌ తిరిగి డ్యూటీలో చేరాడు అని వెల్లడించగా పవన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, తర్వాత రానా, పవన్ కళ్యాణ్ మధ్య క్లైమాక్స్ సీన్స్ పూర్తి చేయనున్నారు. 2022 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా సెట్స్‌లో సందడి చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. పవన్ టీ తాగుతూ త్రివిక్రమ్‌తో మాట్లాడుతూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్‌కు జంటగా నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.