కరోనాపై డ‌బ్ల్యూహెచ్‌వో మరో వార్నింగ్..

173
covid

ప్రపంచ దేశాలను కరోనా డెల్టా వేరియంట్‌ అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( WHO )మరో హెచ్చరిక జారీ చేసింది. మ‌రో రెండు వారాల్లోగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 20 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకానున్నట్లు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్ వెల్లడించారు.

గత వార‌ం దాదాపు 40 ల‌క్ష‌ల కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్ర‌మాదం ఉంద‌ని టెడ్రోస్ తెలిపారు. ఇది మా అంచ‌నాల ప్ర‌కార‌ం త‌క్కువే అని స్పష్టం చేశారు. కరోనా డెల్టా వేరియంట్‌తో కొన్ని దేశాలు తిరిగి లాక్ డౌన్ బాట పట్టిన సంగతి తెలిసిందే.