రాష్ట్రంలో 24 గంటల్లో 6,026 కరోనా కేసులు..

45
corona

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 6,026 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 52 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులుండగా కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా 6,026 కేసులు నమోదుకాగా 6,551 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.