తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు 30వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ పనులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు నిర్మాణ రంగానికి అవసరమైన ముడి పదార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృతమైన పురోగతి అభించింది. ప్రధానంగా 30 వేల కోట్ల రూపాయలతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ది, 8,300కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్‌రూంల నిర్మాణం, చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులు, చెరువుల అభివృద్ది, మోజంజాహీ మార్కెట్‌తో పాటు పురాతన కట్టడాలైన చార్‌కమాన్, ముర్గిచౌక్‌ల పునరుద్దరణ అంతర్గత రోడ్ల నిర్మాణం, మోడల్ మార్కెట్‌లు, ఫంక్షన్‌హాళ్లు, నైట్ షెల్టర్లు, బస్‌షెల్టర్లు తదితర నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో ఇన్ని వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు జరిగిన దాఖలాలు లేవు. దీని వల్ల నగర ఆర్థికాభివృద్దికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులు రావడానికి మార్గం సుగగమైంది. నగరంలో ఏ మూలకు, వైపుకు ప్రయాణం చేసినా భారీ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతూ వందలాది మంది కార్మికులు పనుల్లో నిమగ్నం అయ్యే దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు స్థబ్దంగా ఉండే హైదరాబాద్ పాత బస్తీలోనూ చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్, దాదాపు 4 ఫ్లైఓవర్లు, స్టేడియాలు, ఉద్యానవనాల నిర్మాణాల ఇతర పనులతో సందడితో కనిపిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓల్డ్‌సిటీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని దీనికి నిదర్శనం రోడ్ల విస్తరణ, పర్యాటక ప్రాంతాలాభివృద్ది, నాలాల విస్తరణ, పూడికతీత పనులు, అంతర్గత రోడ్ల నిర్మాణం ఇలా ఎన్నో ఇంజనీరింగ్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు..
పనుల పేర్లు వ్యయం కోట్లలో
1. ఎస్.ఆర్.డి.పి పనులు- రూ. 22,000 కోట్లు
2. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు – రూ. 8,300 కోట్లు
3. ఫ్లైఓవర్ల నిర్మాణాలు (కేంద్రం)నిధులతో- రూ. 1523 కోట్లు
4. అంతర్గత రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు- రూ. 500కోట్లు
5. నాలాల పూడిక పనులు- రూ. 35కోట్లు
6.చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులు- రూ. 36కోట్లు
7. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- రూ. 377.75 కోట్లు
8. మూసీ సుందరీకరణ పనులు- రూ. 377.75 కోట్లు
వ్యూహాత్మక రహదారుల వ్యవస్థతో మారనున్న హైదరాబాద్ రవాణా వ్యవస్థ…
హైదరాబాద్ నగరంలో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకం (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 425 సంవత్సరాల పురాతన నగరమైన హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉన్న రహదారులపై ఫ్లైఓవర్లు, కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టడం అంత్యత కఠినమైనప్పటికీ, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఎస్.ఆర్.డి.పి పనులను అత్యంత వేగవంతంగా నిర్వహిస్తోంది. జీహెచ్ఎంసీ రూ. 25వేల కోట్ల అంచనా వ్యయంతో స్కైవేలు, మేజర్ కారిడార్లు, మేజర్ రోడ్ల నిర్మాణం, గ్రేడ్ సపరేటర్లను ఎస్.ఆర్.డి.పి క్రింద చేపట్టనున్నారు. వీటి నిర్మాణాల ద్వారా 70శాతం ప్రజలకు సులభమయిన, సిగ్నల్ వ్యవస్థలేని రవాణా సదుపాయాలను పొందనున్నారు. రాబోయే 10సంవత్సరాలకు రిలీఫ్ ఏర్పడడంతో పాటు 28 నుండి 30శాతం రవాణా వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్.ఆర్.డి.పిలో భాగంగా చేపట్టనున్న నిర్మాణాలు …
గ్రేడ్ సపరేటర్లు, జంక్షన్లు -54.
ఎలివేటర్ కారిడార్లు, స్కైవేలు – 111 కి.మీ.
మేజర్ కారిడార్‌ల అభివృద్ది – 166 కి.మీ.
ప్రధాన రోడ్ల అభివృద్ది – 348 కి.మీ.
మొత్తం 23 వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఎస్.ఆర్.డి.పి పనుల్లో మొదటి దశలో రూ. 3,200 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. మరో 1300 కోట్లకు టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటికే అయ్యప్ప సొసైటి అండర్‌పాస్, మైండ్ స్పేస్ అండర్‌పాస్, చింతల కుంట అండర్ పాస్‌లు, ఎల్బీనగర్ మన్సూరాబాద్ జంక్షన్ ఫ్లైఓవర్‌లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుచే ప్రారంభించడం జరిగింది. 2018లో మరో 4 నిర్మాణాలు పూర్తి కానున్నాయి. 2019లో 16ప్రాజెక్ట్‌లు పూర్తి కానున్నాయి.
2018లో పూర్తయ్యే వాటి వివరాలు..
1. మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ – జూన్ 2018
2. రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్ – డిసెంబర్ 2018
3. ఎల్బీనగర్ ఎడమవైపు అండర్‌పాస్ – డిసెంబర్ 2018
2019లో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లు..
1. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ – మార్చి 2019
2. బైరమాల్‌గూడ ఎడమవైపు ఫ్లైఓవర్ -మార్చి 2019
3. ఎల్బీనగర్ కుడి వైపు ఫ్లైఓవర్ మార్చి 2019
4. కామినేని కుడి వైపు ఫ్లైఓవర్ – మార్చి 2019
5. రూ. 184కోట్లతో చేపట్టిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి – మార్చి 2019
6. రూ. 150కోట్లతో చేపట్టిన రోడ్ నెం. 45 ఎలివేటెడ్ కారిడార్ – మార్చి 2019
7. రూ. 333కోట్లతో నిర్మిస్తున్న షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ – జూన్ 2019
8. రూ. 265 కోట్లతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సపరేటర్ – జూన్ 2019
9. రూ. 387 కోట్లతో చేపట్టిన బాలానగర్ గ్రేడ్ సపరేటర్ – సెప్టెంబర్ 2019
10.రూ. 132 కోట్లతో ఓవైసీ ఆసుపత్రి-బహదూర్‌పుర కారిడార్ – జూన్ 2019
11. రూ. 426 కోట్లతో చేపట్టనున్నా ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు ఎలివేటెడ్ కారిడార్ – సెప్టెంబర్ 2019
12. రూ. 225కోట్లతో సైబర్ టవర్ వద్ద ఎలివేటెడ్ రోటరీ – సెప్టెంబర్ 2019
13. రూ. 175 కోట్లతో రేతిబౌలి-నానల్‌నగర్ ఫ్లైఓవర్ – డిసెంబర్ 2019
14. రూ. 330కోట్లతో చేపట్టే శిల్పా లేఅవుట్ నుండి గచ్చిబౌలి ఫ్లైఓవర్ – డిసెంబర్ 2019
15. రూ. 270 కోట్లతో చేపట్టే చే నెంబర్ అంబర్‌పేట్ ఫ్లైఓవర్ – సెప్టెంబర్ 2019
16. రూ. 1500కోట్లతో నిర్మించనున్న ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్ – డిసెంబర్ 2019.