ఎస్‌ఎల్‌బీసీ ఘటన ప్రభుత్వ వైఫల్యమే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఎస్ ఎల్ బీ సి టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం..ఎనిమిది మంది ఇంకా టన్నెల్ లో చిక్కుకునే ఉన్నారు ..వారి ప్రాణాలు కాపాడటటం లో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదు ..వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం లో బయటి రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉంది ..దాదాపు 35 లక్షల మంది బయటి రాష్ట్రాల కార్మికులు తెలంగాణ లో పని చేస్తున్నారు..కేసీఆర్ కరోనా కాలం లో కార్మికులు మన రాష్ట్రం వారా పరాయి రాష్ట్రం వారా అని చూడలేదు …ఇపుడు కూడా ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో ఉన్న ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ వహించాలి అన్నారు.
చేయాల్సిన పనులు చేయడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది ..సీఎం కు కార్మికుల ప్రాణాల కన్నా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైంది ..సీఎం కు మానవత్వం లేదు సోయి లేదు ..మంత్రులకు ఫోటో లపై ఉన్న శ్రద్ధ ప్రాణాలు కాపాడటం లో ఉంది ..ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది
..సీఎం ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం ..రాష్ట్ర ప్రజలు టన్నెల్ లో ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆతృత గా ఆరా తీస్తున్నారు .అయినా రాష్ట్ర ప్రభుత్వం తోలు మందం తో వ్యవహరిస్తోంది ..బీ ఆర్ ఎస్ ఈ ఘటన పై రాజకీయాలు చేయడం లేదు ..సీఎం ఓట్ల కోసం బయలు దేరి రాజకీయం చేస్తున్నారు అన్నారు.
గతంలో ఏ సీఎం మండలి ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు ..పీఎం సీఎం తో మాట్లాడారు అన్నారు తప్ప మోడీ ని రక్షణ చర్యల గురించి అడిగినట్టు ఏం వెల్లడించ లేదు ..అసలు వాస్తవాలు వెల్లడించడం లో ప్రభుత్వం విఫలమైంది ..మీడియా కు రకరకాల లీకేజి లు ఇస్తున్నారు ..టన్నెల్ తవ్వేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది ..సీపేజీ ఆగకపోవడం వల్లే గతం లో పనులు ముందుకు సాగలేదు ..అసలు ఈ ఎస్ ఎల్ బీ సి ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర
..నల్లగొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్ ఎస్ బీ సి టన్నెల్ ప్రాజెక్టు ను చేపట్టారు ..నల్లగొండ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకోవడం వల్లే ఎస్ ఎల్ బి సి న తెరపైకి తెచ్చారు ..చిమ్మ చీకట్లో ఆక్సిజన్ సరిగా ఇవ్వకుండా టన్నెల్ లో కార్మికులతో పనులు చేయించారు
..పాలమూరు బిడ్డను తనను కాపాడుకోవాలి అని సీఎం రేవంత్ అంటున్నారు ..దేనికి కాపాడుకోవాలి ?ప్రమాదం జరిగితే ప్రచారానికి వెళ్తున్న సీఎం ను పాలమూరు బిడ్డలు కాపాడుకోవాలా ? చెప్పాలన్నారు.
Also Read:కోహ్లీ..రికార్డుల రారాజు!

