మహా శివరాత్రి .. ఏర్పాట్లు పూర్తి

22
- Advertisement -

మహాకుంభమేళా ముగింపు వేడుకగా ఫిబ్రవరి 26న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు.మహాకుంభ్ ప్రాంతంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఎంత మంది యాత్రికులు వచ్చినా పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళా గత జనవరి 13న పౌష్ పూర్ణిమ సందర్భంగా ఈ మహాకుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఈ మహోత్సవం ముగియనుంది. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు.పవిత్ర గంగ, యమున, సరస్వతి నదులు కలిసి ఏర్పడిన త్రివేణీ సంగమం లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Also Read;హైదరాబాద్‌లో AMGEN ఇన్నోవేషన్ సైట్

- Advertisement -