40 ఏళ్ల చిరు ప్రస్ధానానికి…పునాదిరాళ్లు

290
megastar
- Advertisement -

పైన ఉన్న దేవతలంతా ఆకాశంలోని ఒక తారను భూమ్మీదకు పంపి జీవించమని దీవించి పంపారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు సినీప్రపంచంలో ప్రభంజనంలా ఎంట్రీ ఇచ్చిన ఆ తారే మెగాస్టార్‌ చిరంజీవి. టాలీవుడ్ కు కొత్త ఒరవడిని కల్పించిన హీరో చిరంజీవి. మూడేళ్ల పిల్లాడి దగ్గర్నుంచి, తొంభై ఏళ్ల పండు ముదుసలి వరకు అందరికీ తెలిసిన చిరంజీవి నిన్న‌టితో త‌న 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు.

త‌న తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు సెప్టెంబ‌ర్ 22, 1978లో విడుద‌ల కాగా నిన్న‌టితో ఆ చిత్రం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అరవై సంవత్సరాల వయసులోనూ ఎంతో ఎన‌ర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్న చిరు త్వ‌ర‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చి టాలీవుడ్ ఖ్యాతిని మ‌రింత ఉన్న‌త స్థాయికి తీసుకెళ్ళ‌నున్నారు.

chiru

వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ స్టార్ అయ్యాడు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యాడు. నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు.

Image result for పునాదిరాళ్లు

పునాది రాళ్లు సినిమాతో అతని సినీ జీవితం ప్రారంభమైంది. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజైంది. విలన్ పాత్రలను సైతం కాదనకుండా నటిస్తూ, అలాగే మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించాడు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తనను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది, ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు వంటి వరుస విజయాలతో సుప్రీమ్ స్టార్ నుండి మెగాస్టార్ అయ్యాడు. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం నటించి మెప్పించాడు. అందులో రుద్రవీణ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది.

చిరంజీవి ఒకప్పటి హీరోలైన ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణలతోనే కాకుండా వారి తరువాతి తరాలకు, అలాగే వారి మూడవ తరానికి కూడా పోటీగా నటిస్తూ నేను ఎవర్‌యూత్ అంటూ సాగిపోతున్నారు. ఇక చిరు సినీ జ‌ర్నీ 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని 41లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కి ప్ర‌తి ఒక్క‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

- Advertisement -