బిగ్ బాస్ 4లో నలుగురు హీరోయిన్లు

684
hamsa nandini biggboss4
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కోసం సిద్దంగా ఉంది. కాగా బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ హౌస్ లో పాల్గోనే సెలబ్రెటీలను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. దీనికి హోస్టుగా ఎవరు వ్యవహరిస్తారా అనే విషయం కూడా తీవ్రంగా చర్చజరుగుతోంది. బిగ్ బాస్ 4కు ఎన్టీఆర్ లేదా సమంత హోస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 4లో నలుగురు అందమైన హీరోయిన్లు పాల్గోననున్నారని తెలుస్తుంది. శ్రద్ధా దాస్, యామినీ భాస్కర్, ప్రియా వడ్లమణి, హంసా నందినిలు ఈ సీజన్ లో పాల్గోంటారని ప్రచారం జరుగుతుంది. హంసా నందిని తెలుగులో పలు ఐటెమ్ సాంగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక ప్రియా వడ్లమనేని హుషారు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక యామిణి భాస్కర్.. నాగశౌర్య నర్తనశాల సినిమాలో నటించింది.

అయితే ఈనలుగురు హీరోయిన్ల చేతితో పెద్దగా సినిమాలు లేకపోవడంతో బిగ్ బాస్ 4లో పాల్గోనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు బిగ్ బాస్ 4లో పాల్గోనబోయే కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైర్ గా మారాయి. బిత్తిరి సత్తి, హీరో తరుణ్, యాంకర్ వర్షిణి, ఉదయ భానుల పేర్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -