4 రోజులు బ్యాంకులు బంద్..

18
- Advertisement -

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ నెల 30,31 తేదీల్లో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వగా జనవరి 28,29 నాలుగో శనివారం, ఆదివారం సెలవు. దీంతో నాలుగు రోజులు బ్యాంకులకు హాలీడే రానుంది.

దీంతో బ్యాంక్ సర్వీసులపై ఎఫెక్ట్ పడనుంది. ఫిబ్రవరి 1న కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రకటనకు ముందే బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం చూపనుంది. ఏటీఎం సేవలపైనా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది.

పని రోజులను 5 రోజులకు పరిమితం చేయాలని.. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ వ్యవస్థ ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలని కోరుతున్నారు. కొత్తగా నియామకాలను కూడా వేగవంతం చేయాలని, అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -