దేశంలో 24 గంటల్లో 38,353 కరోనా కేసులు…

59
India Corona cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదుకాగా 497 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.20 కోట్లు దాటగా ఇప్పటి వరకు 3,12,20,981 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,29,179 యాక్టివ్ కేసులుండగా రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.