తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్

88
santhosh

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ‌ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్‌ కుమార్‌ దంపతులకు ఆశీర్వచనం‌ అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్‌ కుమార్‌ వివాహ వార్షికోత్సం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు.